'వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి'
VSP: వైసీపీ శవ రాజకీయాలకు చిరునామాగా మారిందని విశాఖ వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర సంఘటన ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తున్న ఆలయంలో జరిగిందని, ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.