బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద అండర్‌పాస్!
TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రతిపాదన తెచ్చింది. బేగంపేట ఎయిర్ పోర్టు రన్‌వే కింద 600 మీటర్ల పొడవైన 6 లేన్ల అండర్‌పాస్ సొరంగం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. 2 వారాల్లో అనుమతులు లభించే అవకాశం ఉందని HMDA అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.