బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడి

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడి

SDPT: దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాప్‌పై సిద్దిపేట కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం పోలీసులతో కలిసి దాడి చేశారు. ఈ చర్యలో 26.09 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మెరుగు సత్యనారాయణ (48) ఇంట్లోనే అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై కీర్తిరాజు వెల్లడించారు.