సౌందర్య పరిరక్షణకు తేనె

సౌందర్య పరిరక్షణకు తేనె

సౌందర్య పరిరక్షణలో తేనె ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెదాలపై తేనె రాయడం వల్ల అవి పొడిబారకుండా ఉంటాయి. తేనె చర్మకాంతిని పెంచడంతో పాటు చర్మంలో తేమ ఉండేలా చేసి సాఫ్ట్‌గా మారుస్తుంది. తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే మంచిది.