అమరావతిలో పర్యటించిన సింగపూర్ బృందం

కృష్ణా: సింగపూర్ బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. ఈ బృందానికి సీఆర్డీఏ అధికారులు రాజధానిలో చేపట్టిన పలు భవన నిర్మాణాల గురించి వివరించారు. ఉండవల్లి వద్ద వరద నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను సీఆర్డీఏ అధికారులు వివరించారు.