మాజీ సర్పంచ్ మృతి.. మంత్రి నివాళి
NGKL: చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత తిరుమల రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇవాళ గ్రామంలోని ఆయన నివాసంలో తిరుమల్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను జూపల్లి గుర్తు చేసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.