'రైతులకు వాట్సాప్ ద్వారా వ్యవసాయ సమాచారం'

MDK: రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వ్యవసాయ సమాచారం అందించేందుకు వ్యవసాయ వాట్సాప్ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దీపిక తెలిపారు. ఈ ఛానల్ ద్వారా రైతులు విత్తన దశ నుంచి పంట కోత వరకు వివిధ యాజమాన్య పద్ధతులు, కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ, వాతావరణ సూచనలు గురించి తెలుసుకోవచ్చన్నారు.