ఆ రహదారిలో ప్రమాదకరంగా ప్రయాణం..
NLG: కట్టంగూరు మండలంలోని పలు గ్రామాల బీటీ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కట్టంగూరు – ఈదులూరు, పరడ, కురుమర్తి, బొల్లెపల్లి, ఈదులూరు – పందెనపల్లి రహదారులు గుంతలతో నిండిపోయాయని స్థానికులు తెలిపారు. రోజూ వేలాది మంది ప్రయాణించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.