అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ RRRకు రిస్ట్ ఎముకకు శస్త్ర చికిత్స
W.G: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాపోటీలలో క్రికెట్ ఆడుతుండగా రన్ చేస్తూ కింద పడిపోయిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు రిస్ట్ ఎముక శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చికిత్స తరువాత కోలుకుంటున్నారు. హైదరాబాద్ AIG ఆసుపత్రిలో ఆయనకు గురువారం శస్త్ర చికిత్స జరిగింది.