అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టు

అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్టు

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా ఆస్ట్రేలియా పౌరులే లక్ష్యంగా అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నకిలీ కాల్ సెంటర్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి లావాదేవీలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. 9 మందిని అరెస్టు చేసి 12 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.