సుంకేసుల బ్యారేజీకి పెరిగిన వరద

GDWL: రాజోలిలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. శుక్రవారం బ్యారేజీలోకి ఇన్ ఫ్లో 41,000 క్యూసెక్కులు వస్తోంది. బ్యారేజీలో 1.110 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. బ్యారేజీ 9 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,441, కేసీ కెనాలు 2,354, మొత్తం 41,765 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.