VIDEO: అంజన్న సన్నిధిలో భక్తజన సంద్రం
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కంపార్ట్ మెంట్‌లు దీక్షా స్వాములతో కిక్కిరిసిపోయాయి. అంజన్న సన్నిధికి చేరుకున్న దీక్షా స్వాములు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా నేరుగా కళ్యాణకట్టకు చేరుకొని మాల విరమణ గావించేందుకు గాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లలో పూర్తిగా నిండిపోయారు. 150 మంది అర్చకులను, 1500 మంది క్షురకులను అధికారులు అదనంగా కేటాయించారు.