జడ్పీ హైస్కూల్‌కు స్థలం కేటాయింపుపై పరిశీలన

అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలో జిల్లా పరిషత్‌కు 12 ఎకరాల స్థలం ఉందని ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పి ఛైర్ పర్సన్ సుభద్ర అన్నారు. ఈ స్థలంలో మూడు ఎకరాలను జడ్పీ హైస్కూల్‌కు కేటాయించేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సోమవారం కొత్తూరులో ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కొంత స్థలం ఆక్రమణలకు గురైందన్నారు. ఆక్రమణలను తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.