స్కూటీని ఢీ కొట్టిన కంటైనర్.. వ్యక్తి మృతి

PLD: రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద మంగళవారం పిడుగురాళ్ల వైపు వెళుతున్న కంటైనర్ స్కూటీని ఢీకొట్టడంతో గుంటూరుకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుమలరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రుడిని హుటాహుటిన 108 వాహనంలో సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.