12 బస్తాలు రేషన్ బియ్యం స్వాధీనం: SI

NLR: ఆటోలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు అల్లూరు ఎస్సై శ్రీనివాసుల రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సై కథనం మేరకు... అల్లూరు మండలంలోని పురిని గ్రామం నుంచి ఆటోలో 12 బస్తాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా దాదాపుగా 300 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలియజేశారు. ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.