ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళినాయక్, ఎంపీ బలరాం నాయక్ హాజరై మాట్లాడారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.