రోడ్లపై పొంగి పొర్లుతున్న మురుగునీరు
SKLM: నందిగాం(M) కొత్తగ్రహారం గ్రామంలోని కొండి వీధిలో ఉన్న సీసీ రోడ్డు డ్రైనేజీని తలపిస్తోంది. ఈ రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు లేకపోవడంతో... ఇళ్లల్లో వాడిన నీరు రోడ్డు మీదకు చేరి ప్రవహిస్తోంది. మురుగనీరు చేరడంతో సీజనల్ వ్యాధులు ప్రబలించే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు. ఇదే వీధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవలను వినియోగించుకోవాలన్న మురుగు దాటాల్సిందే.