కూల్చివేతలపై గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం

BDK: చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలో గురువారం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రెవెన్యూ భూమిలో ప్రజలు నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు,పోలీసుల సహాయంతో కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కళాశాల కొరకు ఈ స్థలం కేటాయించడం జరిగిందని నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని MRO హెచ్చరించారు.