UPHCని తనిఖీ చేసిన కలెక్టర్

UPHCని తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం: శ్రీనివాసనగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఆయన ఆసుపత్రిలోని పారిశుధ్య పనులు, వోపీ సేవలు, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.