నెల్లూరు జిల్లాలో ఆగని హత్యలు

ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో ఆర్నెళ్లుగా వరుస హత్యలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలో ఇటీవల చోటుచేసుకున్న జంట హత్యలు, కొద్ది రోజుల క్రితం కావలి మండలంలో ఓ పార్టీ కార్యకర్త హత్య, రెండు రోజుల క్రితం బుజబుజ నెల్లూరులో మహిళ హత్యతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సీఐలపై వేటు పడినప్పటికీ ఈ హత్యలు ఆగడం లేదు.