లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు

లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని దేవాంగనగర్ కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 11తేదిన ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కుందూరు తిరుపతిరెడ్డి తెలిపారు. పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.