హరీష్.. రోజుకో డ్రామా చేస్తున్నారు: మల్లు రవి
TG: రాజకీయ లబ్ది కోసం మాజీ మంత్రి హరీష్ రావు రోజుకో డ్రామా చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. వారి హయాంలో నిర్బంధాలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ధర్నా చౌక్‌నే ఎత్తేశారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అరెస్టులు చేసేవారని ధ్వజమెత్తారు.