కమలాపురంలో విషాదం
KDP: కమలాపురం పట్టణంలో ఈనెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. రైల్వే గేటు సమీపంలోని చర్చి వద్ద రెండు స్కూటర్లు ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు సంకీర్త్ (29) తిరుపతిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశాడు. మృతుడు స్థానికుడు కాగా.. ఆయనకు భార్యతో పాటు 4 ఏళ్ల పాప, ఏడాది బాబు ఉన్నారు.