'నిజాలు రాస్తే అక్రమ కేసులతో కూటమి బెదిరింపులు'
NDL: నిజాలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టి బెదిరించడం కూటమి తగదని వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, CPI, ML జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నందికొట్కూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట APUWJ అద్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో ధర్నాచేసి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వార్తలు రాసే పాత్రికేయులకు నోటీసులు ఇచ్చి కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.