రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్

NDL: రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం కొలిమిగుండ్ల రైతు సంఘం కార్యాలయంలో సీపీఐ, ఏఐటీయూసీ, రైతు సంఘం నాయకులు కలిసి సమావేశమయ్యారు. అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.