బైరవాని తిప్ప ప్రాజెక్టుకు జలకళ
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్టలో పేరుగాంచిన బైరవాని తిప్ప ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంటోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకి భారీగా వరద కొనసాగుతున్నట్లు జలవనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1655 అడుగులు కాగా.. ప్రస్తుతం 1647.3 అడుగులకు నీరు చేరినట్లు వెల్లడించారు.