అనంతపురంలో ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

ATP: ‘సూపర్ సిక్స్ - సూపర్ హిట్’ సభ నేపథ్యంలో అనంతపురంలో భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సభా స్థలి, హెలిప్యాడ్, ట్రాఫిక్ మార్గాలపై సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ బందోబస్తు ప్రణాళికను వారికి వివరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తామని స్పష్టం చేశారు.