ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాలోజీ జయంతి వేడుకలు

SRPT: స్థానిక కొల్లు లక్ష్మీనరసమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాళ ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి 111వ జయంతి వేడుకలను జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డి. విజయ నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కలయిక " అని యావత్ తెలంగాణకు తెలియజేసిన మహా మేధావి అని వారి సేవలను కొనియాడారు.