పరిగి మున్సిపల్ ఎన్నికల్లో హంగ్
VKB: పరిగి మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 'హంగ్' ఏర్పడింది. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో 8 స్థానాలను గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంలో వారు కీలకంగా మారారు. స్వతంత్రుల మద్దతు ఏ పార్టీకి ఉంటే వారికే ఛైర్మన్ పీఠం దక్కుతుంది.