సాగు నీరు వృథా.. ఎవరికి పట్టదా..?

KNR: 2 TMCల సామర్థ్యం కలిగిన ఎగువ మానేరు ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకొని నిండుకుండను తలపిస్తోంది. అయితే ఎగువ మానేరు మత్తడి పారితే వచ్చే నీటిని దిగువ ప్రాంతాలకు మళ్లిస్తారు. అనేక చోట్ల ప్రధాన కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీరు వృథాగా బయటకు వెళుతోంది. శిథిలావస్థకు చేరిన కాలువలు, చెరువుల మరమ్మతులపై అధికారలు నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు వాపోతున్నారు.