రైలు ఢీకొని వృద్ధుడు మృతి
SKLM: టెక్కలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలు ఢీకొని మండలంలోని నర్సింగపల్లి గ్రామానికి చెందిన ఎస్.చలపతిరావు(70) మృతిచెందాడు. స్థానికులు వివరాలు మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైల్వే గేటు నుండి టెక్కలి రైల్వే స్టేషన్ మధ్యలో వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.