నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
WNP: జిల్లా కేంద్రంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. పట్టణంలోని 33/11 కెవి సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కృష్ణదేవరాయ నగర్ కాలనీలోని పార్కు, నాగరాజు హాస్పిటల్ రోడ్డు, బొందలగడ్డ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సుధాకర్ తెలిపారు.