భారీ కొండచిలువ కలకలం
CTR: ఎస్ఆర్ పురం మెదవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ భారీ కొండచిలువ స్థానికులను బెంబేలెత్తించింది. కొందరు పశువుల కాపరులు మేతకు అటవీ ప్రాంతం వైపు తమ పశువులను తీసుకెళ్లారు. అక్కడ ఈ కొండచిలువ కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకులు పెడుతూ పరుగులు తీశారు. స్థానికులు వచ్చి చూసేలోపే అడవిలోకి వెళ్లిపోయింది.