సిద్దిపేట కలెక్టర్‌గా కే.హైమావతి

SDPT: సిద్దిపేట కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ చాంబర్‌లో వేదపండితుల ఆశీర్వచనం తీసుకొని జిల్లా కలెక్టర్‌గా కే.హైమావతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పుష్ప గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.