VIDEO: నాచారం చౌరస్తాలో ఆటో కార్మికుల నిరసన
HYD: నాచారం చౌరస్తాలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నా LPG గ్యాస్ దొరకడంలేదని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గత నెల రోజుల నుంచి గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దగ్ధం చేసి, LPG గ్యాస్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.