వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణ: పోస్ట్ మెట్రిక్ మైనార్టీ బాలుర వసతి గృహంలో చేరేందుకు ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న నంద్యాల జిల్లాలోని మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హాస్టల్ వార్డెన్ జాకీర్ తెలిపారు. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఉన్న హాస్టల్లో చేరే విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.