భీమవరంలో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహణ

భీమవరంలో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహణ

W.G: భీమవరం శాఖ గ్రంథాలయంలో ప్రపంచ పుస్తక దినోత్సవం గురువారం నిర్వహించారు. పోటీ పరీక్షలకు వెళుతున్న పాఠకులకు అవసరమైన రూ.10 వేల విలువ గల పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు సౌజన్యంతో అందించడం స్ఫూర్తిదాయకమని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అల్లు శ్రీనివాస్, SI కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.