VIDEO: 'మృతునికి 5మంది ఆడపిల్లలు'
ప్రకాశం: మార్కాపురం బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బొమ్మల చెరువుకు చెందిన ఆత్మకూరి చిన్నయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతనికి 5 మంది ఆడపిల్లలని, వారి వయసు 18, 14, 12, 10, 7 సంవత్సరాలు. తండ్రి ఇంటికి చేరుతారని పిల్లలు ఎదురు చూస్తున్నారని, వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.