శివ నామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
VZM: మహాశివరాత్రి పురస్కరించుకొని గజపతినగరం మండలంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వరాలయం, పురిటిపెంట సంతతోట ఆవరణలో గల మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు మరుపల్లిలోని శివాలయం భక్తులతో కిటకిట లాడాయి. ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు కిషోర్ భక్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.