విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

NLR: విద్యుత్ షాక్‌తో చైతన్య అనే యువకుడు మృతి చెందిన ఘటన కందుకూరులో జరిగింది. కావలి బుడంగుంట కాలనీకి చెందిన గిరిజన యువకుడు బుధవారం ఓ ఇంట్లో కార్పెంటర్ పనిచేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈమేరకు చైతన్య తల్లిదండ్రులు గురువారం కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.