VIDEO: 'స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి'

GNTR: గుంటూరులోని చుట్టుగుంట, హనుమాన్ నగర్ వద్ద వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని శుక్రవారం ప్రచారం నిర్వహించారు. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు పెంచినా, స్మార్ట్ మీటర్లు బిగించినా ఎక్కడికక్కడ పగలగొడతామని, ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.