ఓఆర్ఆర్‌పై ఏఐ కెమెరాలతో నిఘా
RR: ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వీటి ద్వారా డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోనున్నారు.