చైనాపై మండిపడ్డ భారత్

అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు చైనా ప్రయత్నించడాన్ని భారత్ ఖండించింది. డ్రాగన్ దేశ వక్రబుద్ధిని తప్పుబడుతూ.. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని కేంద్రం చైనాపై తీవ్రంగా స్పందించింది. చైనా చేస్తున్న ఇలాంటి వ్యర్థమైన, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని.. అరుణాచల్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్రం స్పష్టం చేసింది.