'జోన్‌లోనే వ్యాపారాలు చేసుకోవాలి'

'జోన్‌లోనే వ్యాపారాలు చేసుకోవాలి'

NTR: వీధి వ్యాపారులు నగరంలో నిర్మించిన వెండర్స్‌ జోన్‌లోనే తమ వ్యాపారాలు చేసుకొని, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా సహకరించాలని ట్రాఫిక్ సీఐ కిషోర్ బాబు తెలిపారు. సోమవారం వ్యాపారస్తులతో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.