శివాలయాల వద్ద పోలీసుల బందోబస్తు
NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో ఈరోజు స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఎస్సై అర్జున్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ ఆలయం వద్ద చోటు చేసుకున్న ఘటనతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఎస్సై తెలిపారు.