నేడు జడ్చర్లకు మందకృష్ణ మాదిగ రాక..!
MBNR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం జడ్చర్లకు రానున్నారు. చంద్రా గార్డెన్‌లో జరగనున్న ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇంఛార్జ్ బొర్రా భిక్షపతి మాదిగ ఈ విషయాన్ని తెలిపారు. నాయకులు సకాలంలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.