ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: పట్టణంలోని మ్యూజికల్ గార్డెన్‌లో ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ప్రేమ, శాంతి, త్యాగానికి ఈస్టర్ పండుగ ప్రత్యేక అని MLA తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, క్రైస్తవ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.