VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
MHBD: తొర్రూరు పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.