కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్వర్డ్‌పై కక్ష సాధింపు!

పలు కారణాలతో హార్వర్డ్ వర్సిటీకి నిధులను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ కుమారుడు బారన్‌కు వర్సిటీలో సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని హార్వర్డ్ ఖండించింది. మరో వైపు మెలానియా ట్రంప్ కార్యాలయం కూడా వివరణ ఇచ్చింది అసలు బారన్ వర్సిటీకి దరఖాస్తు చేయలేదని తెలిపింది.