VIDEO: కొండగట్టులో మద్యం మత్తులో కానిస్టేబుళ్లు!
JGL: కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాల బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తూలుతూ కనిపించడం కలకలం రేపింది. గుట్ట కింద బెల్టు షాపులో మద్యం సేవించి, రోడ్డుపై పడిపోయిన ఒక కానిస్టేబుల్‌ను అంబులెన్స్‌లో తరలించారు. ఈ వీడియో SMలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పుణ్యక్షేత్రంలో పోలీసుల ప్రవర్తనపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.